Prakasam: అక్రమంగా సముద్రంలోకి ప్రవేశించిన తమిళనాడు మత్స్యకారులు
Prakasam: సినిమా ఫక్కీలో నడి సంద్రంలో ఛేజింగ్
Prakasam: సినీ ఫక్కీలో పోలీస్ ఛేజింగ్ నడి సంద్రంలో ఉత్కంఠ రేపింది. తమిళనాడు కడలూరుకు చెందిన మత్స్యకారులు అక్రమంగా మత్స్యసంపదను దొచుకునేందుకు ప్రయత్నించారు. ప్రకాశం జిల్లా పాకల పోతయ్యగారి పట్టపుపాలెం తీరప్రాంత మత్స్యకారులు పోలీసులను ఆశ్రయించారు. కడలూరు మరబోట్లను సంద్రంలో చూసిన మెరైన్ పోలీసులు వాటిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 30 మంది పోలీసులు స్థానికులతో కలిసి సముద్రంలో చేజింగ్ చేశారు. అధిక వేగంతో పోలీసులకు చిక్కకుండా కడలూరు బోట్లు పరుగులు తీశాయి.