Tirupati: భారీ వర్షాలకు తడిసి ముద్దైన తిరుపతి నగరం

* వరుస తుఫాన్‌లతో జనజీవనం అస్తవ్యస్థం * 160 పాత కట్టడాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి -అధికారులు

Update: 2021-11-29 03:26 GMT

తిరుపతి(ఫైల్ ఫోటో) 

Tirupati: దంచికొడుతున్న వానలకు తిరుపతి నగరం తడిసిముద్దైంది. ఎన్నడూ ఎదుర్కోని విపత్తను ఎదుర్కొంది. వరుసగా మూడు సార్లు వచ్చిన తుఫాన్‌ల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న హెచ్చరికలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

మరోవైపు కూలుతున్న భవనాలు, కుంగుతున్న కట్టడాలతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అటు నగరంలోనే 160 వరకు పాత కట్టడాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 16 భవనాలు కూల్చక తప్పదని నోటీసులు జారీ చేశారు. వర్షాలు పడుతున్న సమయంలో ఆఇళ్ళలో ఎవరినీ ఉంచకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

శ్రీకృష్ణనగర్‌లో చోటు చేసుకున్న ఘటనలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. భూమిలోంచి నీటి సంపు 15 అడుగుల మేర పైకి లేస్తే, మరోచోట మూడంతస్తుల భవనం కుంగుబాటుకు గురైంది. చుట్టుపక్కల 17 ఇండ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో కూలుతున్న భవనాల మధ్య ఉన్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. ప్రజల అప్రమత్తతోనే అవాంఛనీయ సంఘటలను జరగకుండా ఆపగలుగుతామంటున్నారు అధికారులు.

Tags:    

Similar News