చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. పలమనేరు క్యాటల్ ఫార్మ్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా
* డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన బస్సు... ఒకరు మృతి మరో 20 మందికి గాయాలు
Chittoor District: చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పలమనేరు క్యాటల్ ఫార్మ్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుడు గుంటూరుకు చెందిన విజయ్‌గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.