R Krishnaiah: రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా

R Krishnaiah Resign: రాజ్యసభ సభ్యత్వానికి ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు.

Update: 2024-09-24 13:13 GMT

R Krishnaiah Resign

R Krishnaiah Resign: రాజ్యసభ సభ్యత్వానికి ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయినట్టుగా రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్ ను విడుదల చేసింది. 

వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.  మరో వైపు ఆర్.కృష్ణయ్య కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం కూడా సాగుతోంది. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాకు గల కారణాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఆయన బుధవారం ప్రకటించనున్నారు .కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో ఆ పార్టీ బలం పదకొండు నుంచి ఎనిమిదికి పడిపోయింది. ఇటీవలనే వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేశారు.

2022 మే 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్, నిరంజన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులుగా ప్రకటించింది. ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ సంఘం నాయకులుగా ఉన్న ఆర్. కృష్ణయ్య ను వైఎస్ఆర్ సీపీలో చేర్చుకోవడం ద్వారా బీసీలకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని వైఎస్ఆర్ సీపీ సంకేతాలు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని ఎల్ బీ నగ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందారు. 2018 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరారు. 


Tags:    

Similar News