Tirumala: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతా లోపం
Tirumala: నాసిరకం సరుకులను సరఫరా చేస్తున్న కొన్న సంస్థలు
Tirumala: తిరుపతి అనగానే టకీమని గుర్తొచ్చేది తిరుపతి లడ్డూ. ఈక్షేత్రానికి ఎవరు వెళ్తున్నారన్నా.. ప్రసాదం మరిచిపోకండి అంటూ మరీ చెబుతారు.. ఎవరైనా వెళ్లి వచ్చా కాసింత ప్రసాదం ఇచ్చినా కళ్లకద్దుకుని నోట్లేసుకుంటారు.. ఈ లడ్డూకు అంత క్రేజ్ మంచి, ఆవు నేతి మేలురకమైన ముడి సరులతో తయారు చేసే ఈ లడ్డూను మించిన దైవ ప్రసాదం మరో లేదంటే నమ్మాల్సింది. అలాంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో రాన్నానూ నాణ్యత తగ్గుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలంకార ప్రియుడే కాదు.. భోజన ప్రియుడైన వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజూ మూడు పూటలా అందించే 32 రకాల వెరైటీ ప్రసాదాలలో అన్నప్రసాదాలతో పాటుగా లడ్డు, పిండి వంటలను నివేదన చేస్తారు. అలా ప్రతిరోజూ శ్రీవారి నైవేధ్యంతోపాటు ఇటువివిధప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సైతం ఈలడ్డూ ప్రసాదం తయారీ, నాణ్యతలో అసలే రాజీపడబోమంటారు ఇక్కడి ఆలయ అర్చకులు. స్వామి వారికీ సమర్పించే ఎంతో నైవేద్య ప్రసాదాలను నాణ్యతలో రాజీలేకుండా ప్రసాదం తయారీ ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా ప్రతిరోజూ స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాలు, అన్నదానం, అనుబంధ ఆలయాల్లో ప్రసాదాల తయారీలో 2వేల 600కిలోల జీడిపప్పును వాడుతుంటారు.
దీంతో ఈప్రసాదాలు, నైవేధ్యాల తయారీ కోసం కావాల్సిన ముడిసరుకులతోపాటు ఈ లడ్డూ ప్రసాదం తయారీలో ఎక్కువగా ఉపయోగించే జీడిపప్పు కోసం టీటీడీ ఆన్‌లైన్ ఈ ప్రొక్యూమెంట్ ద్వారా టెండర్లకు పిలుస్తుంది. అల రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ టెండర్ల కోసం భారీగానే పోటీ ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వారికే టెండర్ కట్టబెడుతుంది టీటీడీ. అలా ఈ టెండర్లు దక్కించుకునే సంస్థలు రెండేళ్ల పాటు ప్రసాదాల తయారీకి జీడీపప్పు, కంది, ఉద్ది, ఇతర పప్పులు ధాన్యాలు వంటి ఏ1 గ్రేడ ముడిసరుకులు సరఫరా చేస్తాయి. అలా వచ్చిన ముడిసరుకులను వచ్చిన ముడి సరుకును తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్లో పరీక్షిస్తుంటారు. అక్కడ పూర్తిస్థాయిలో నాణ్యత ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే ముడి సరుకును ఉగ్రాణం., గోడౌన్ కు తరలిస్తారు.
ఇదంతా బాగానే ఉన్నా ఈటెండర్లు దక్కించుకునన ఓ కంపెనీషరతు కంటే ఎక్కువగానే దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నట్లు తాజాగా టీటీడీ అధికారులు గుర్తించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యతగానే ఉన్నప్పటికీ.. ఓ కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు ఇతర ముడిసరుకులు నాసిరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నాణ్యత సరిగా లేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.. అనంతరం మిగతా యాలకులు, ఇతర ముడిసరుల నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. మిగతా సరుకులను కూడా ప్రభుత్వ ల్యాబ్ కి పంపాలని ఆదేశించారు. అత్యంత పవిత్రంగా భావించే నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులల్లో నాణ్యతా లోపాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 500 కోట్లు ఖర్చు చేసి జీడిపప్పు, నెయ్యి, యాలకులు కోనుగోలు చేస్తున్నామన్న చైర్మన్ సుబ్బారెడ్డి నాణ్యత లోపాలపై భక్తుల ఫిర్యాదు మేరకు తనిఖీ చేశారు.
టీటీడీ వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదం, ఇతర నైవేద్యాల తయారీని పకడ్బంధీగా నిర్వహించాలన్న నిబంధనను ఎక్కడ ఎవరు తుంగలో దొక్కారన్నదానిపై టీటీడీ ఇప్పుడు ఫోకస్ పెడుతోంది. ఇంటిదొంగలుపని పట్టేపనిలో పడింది. ఈ సరుకలు నాణ్యతను ఇన్నాళ్లు ఎవరు ఫైనల్ చేశారన్న కోణంలో ఆలోచిస్తున్నారు. సరుకులు రాగానే ముందుగా క్వాలిటీ క్వాంటిటీ చెక్ చేసుకోవాల్సింది పోయి సంబంధిత సిబ్బంది ఏం చేస్తున్నారన్న కోణంలో విచారిస్తన్నారు అధికారులు. తూతూ మంత్రంగా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అందుకే సరుకులు నాసిరకంగా వస్తున్నట్లు గుర్తించారు. ఈ సరుకుల కొనుగోళ్లు, నాణ్యతపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించి.
ఇక తిరుమలకు ముడిసరుకుల కొనుగోళ్లపై దృష్టి సారించడంతోపాటు.. ఈ సరుకుల నాణ్యత పర్యవేక్షణాధికారిగా టీటీడీలో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారితో ఓ విభాగాధితిగా నియిమించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. అంతేకాదు తిరుపతి మార్కెటింగ్ గోడౌన్ లో ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.