AP Election Results: చిత్తూరు నగరంలో పోలీసుల మాక్‌ డ్రిల్.. అల్లర్లకు పాల్పడితే..

Chittoor: సమస్యలు పరిష్కరించాలంటూ అక్కడ ఆందోళన జరుగుతోంది. ఆందోళనకారులు దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు.

Update: 2024-05-29 04:27 GMT

AP Election Results: చిత్తూరు నగరంలో పోలీసుల మాక్‌ డ్రిల్.. అల్లర్లకు పాల్పడితే..

Chittoor: సమస్యలు పరిష్కరించాలంటూ అక్కడ ఆందోళన జరుగుతోంది. ఆందోళనకారులు దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు అల్లరిమూకలు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు సేఫ్టీగార్డులను అడ్డం పెట్టుకుని, బాష్పవాయు ప్రయోగిస్తూ వారిని కట్టడి చేసే చర్యలు చేపట్టారు. ఒక దశలో గాలిలోకి కాల్పులు జరిపేందుకు పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ గొడవల్లో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి తరలించారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదంతా నిజంగా జరిగింది కాదు. అంతా ఉత్తుత్తిదే. ఓట్ల లెక్కింపు, ఫలితాల అనంతరం అసాంఘిక శక్తులు జరిపే అల్లర్లు, విధ్వంసాలను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసుశాఖ మాక్ డ్రిల్ నిర్వహించింది.

చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఆర్ముడ్ రిజర్వు పోలీసులు, ఎస్టీఎఫ్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ జిల్లా ఎస్పీ మణికంఠ పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా హింస్మాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా...చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడినా....గట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. శాంతియుతంగా ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. 

Tags:    

Similar News