Devaragattu: బన్ని ఉత్సవంలో పగిలిన తలలు...90మందికిపైగా గాయాలు..కొందరి పరిస్థితి విషమం?

Devaragattu Banni festival:కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్థరాత్రి జరిగే బన్ని ఉత్సవం ఈ ఏడాది కూడా జరిగింది. ఈ ఉత్సవంలో కొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Update: 2024-10-13 05:04 GMT

Devaragattu: బన్ని ఉత్సవంలో పగిలిన తలలు...90మందికిపైగా గాయాలు..కొందరి పరిస్థితి విషమం?

Devaragattu Banni festival: కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్థరాత్రి జరిగే బన్ని ఉత్సవం ఈ ఏడాది కూడా జరిగింది. ఈ ఉత్సవంలో కొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉత్సవంలో సుమారు 90మందికిపైగా గాయపడ్డారు. శనివారం అర్థరాత్రి 12గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం ముగిసిన తర్వాత వందలాది మంది భక్తులు ఉత్సవమూర్తులను సొంతం చేసుకునేందుకు పోటీ పడటంతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

దేవరగట్టులో జరిగే ఈ దాడుల్లో సుమారు 90మందికిపైగా గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతోపాటుగా నిప్పు రవ్వలు పడి ఇంకొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కూడా ఈ ఏడాది భక్తులకు గాయాలయ్యాయి.

దసరా పండగ సందర్భంగా దేవరగట్టులో కొలువైన మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్తారు. ఆలయ నిర్వాహక గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు పెద్ద సంఖ్యలు చేరుకుంటారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. అర్థరాత్రి జరిగే ఈ ఉత్సవంలో ప్రతీసారీ గాయాలపాలవుతున్న వారిపట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్సవం మాత్రం అలాగే కొనసాగుతుంది.


Tags:    

Similar News