Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే?

Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గం వర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు.

Update: 2024-06-04 10:20 GMT

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పిఠాపురం ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. పిఠాపురం నియోజకవర్గం వర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు.

అటు పవన్ కళ్యాణ్ గెలిచిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇక టీవీ స్క్రీన్‌పై పవన్ విజయాన్ని చూసి.. ఆయన సోదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. కాగా, కుటుంబ సభ్యులు, జనసైనికులతో కలిసి పిఠాపురంలో నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పవన్ విజయంతో జనసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.

Tags:    

Similar News