Srisailam: శ్రీశైలం దేవస్థానంలో కొత్త ఆర్జిత సేవ ప్రారంభం
Srisailam: జనవరి 3 నుంచి ప్రాత:కాలం సేవ ప్రారంభం
Srisailam: శ్రీశైలం మహా క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలు ఆర్థిక సేవలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 3 నుంచి నూతనంగా ప్రాతఃకాల సేవను ప్రారంభించనుంది. ఈ సేవలో దంపతులు లేదా ఒక్కరు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. ఈ సేవకు సంబంధించి రుసుముగా 25 వేల 116 రూపాయలను నిర్ణయించింది. సేవాకర్తలను స్వామివారి మహా మంగళ హారతి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే.. శ్రీ అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు.
ప్రాత:కాల సేవలో పాల్గొనేవారికి మల్లికార్జున సదనంలో ఉచిత వసతి కల్పించనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం నిర్వహించబడుతున్న ఉదయాస్తామాన సేవకు మరియు ప్రాతఃకాల సేవకు రెండింటికి కలిపి ఆరు టికెట్లు మాత్రమే ఇవ్వబడతాయని ఆలయ ఈవో తెలిపారు. ఉదయస్థమాన సేవకు ఒక టికెట్, ప్రాతఃకాల సేవకు 5 టికెట్లు ఇవ్వబడతాయని ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైల దేవస్థానం వెబ్‌సైట్‌లో టికెట్లను పొందవచ్చని తెలిపారు.