Jogi Ramesh: ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేసినప్పుడు బాలకృష్ణ ఎక్కడున్నారు..?
Jogi Ramesh: ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేసినప్పుడు బాలకృష్ణ ఎక్కడున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు.
Jogi Ramesh: ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేసినప్పుడు బాలకృష్ణ ఎక్కడున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, సీఎం కుర్చీని చంద్రబాబు లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి కోరికను కన్న కొడుగ్గా బాలకృష్ణ తీర్చలేదని అలాంటివాళ్లు ఎన్టీఆర్ తనయులుగా ఎలా చెలామణి అవుతారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టిన ఘనత సీఎం జగన్‌దే. అధికారంలో ఉండి ఏరోజైనా బాబు దీని గురించి ఆలోచించారా?. మీరు అసలైన శునకాలు. మీరు ఎన్టీఆర్ కుమారులైనా పరమశుంఠలు. అసెంబ్లీకి బాలకృష్ణ ఎందుకు రాలేదు?. ఎంగిలి మెతుకులు కోసం చంద్రబాబు పంచన చేరిన మీకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అంటూ జోగి రమేష్ నిప్పులు చెరిగారు.