AP DSC Notification: గుడ్ న్యూస్... ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్... 2 నెలల్లోనే పోస్టింగులు కూడా

Update: 2025-03-25 15:20 GMT

AP DSC Notification: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్... 2 నెలల్లో పోస్టింగులు కూడా

Mega DSC Notification in AP: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ తిరిగి ప్రారంభం అయ్యేనాటికి డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ వివరాలను ప్రకటించారు.

మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాలో ఆ డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే, ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడినపెడుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ధ్యేయంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించామన్నారు. 2027 చివరి నాటికల్లా అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. అందుకోసం వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ వంటి సంస్థల నుండి తీసుకుంటున్న అప్పును కూడా ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా తీర్చేస్తామని వివరించారు. 

Tags:    

Similar News