Srisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా రథోత్సవం
Srisailam: స్వామివారి రథంపై అరటిపండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్న భక్తులు
Srisailam: శ్రీశైలం మల్లికార్జునస్వామివారి రథోత్సవం కన్నులపండువగా సాగింది. శివపంచాక్షరి, ఓంకార నాదంతో రథాన్ని ముందుకు నడింపించారు. పార్వతీ పరమేశ్వరులు దివ్యరథాన్ని అధిరోహించి లోకసంచారసంకేతంగా విహరించారు. ఆదిదంపతులు అధిష్టించి దివ్యరథాన్ని తాకిన భక్తులు పులకించిపోయారు. మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లు దివ్యరథంపైనుంచి భక్తులను ఆశీర్వదించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథంపై అరటి పండ్లను విసిరి భక్తిని చాటుకున్నారు. రథోత్సవంలో ఈవో లవన్న, శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ శివాచార్య స్వామి, ఆలయ పాలకమండలి ఛైర్మన్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.