Weather Updates: తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ

Weather Updates: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

Update: 2022-11-18 03:35 GMT

Weather Updates: తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందనీ, దీని కారణంగా తుఫాను సంభవించే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, నవంబర్ 25 నాటికి నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చునని అంచనా వేస్తున్నారు.

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో. దీంతో ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశకు ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ వ్యవస్థ తీరం దాటే వరకు శ్రీలంక, తమిళనాడులో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో నవంబర్ 19, 21 మధ్య ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని... జిల్లా యంత్రాంగం హెచ్చరికలు చేస్తూ.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేసింది.

ఉత్తర, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Full View
Tags:    

Similar News