Kodali Nani: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయి

Kodali Nani: పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

Update: 2023-03-29 12:24 GMT

Kodali Nani: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయి

Kodali Nani: పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు. ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరును ప్రజలంతా స్మరిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. 2014లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కోనుగులు చేశారని.. 2019లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయన్నారు. ఇప్పుడు నలుగురిని లాక్కకున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News