Kesineni Nani: ప్రజల కోసం పని చేసే ఏ వ్యవస్థ అయినా మంచిదే
Kesineni Nani: ఏపీలో వాలంటీర్లపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
Kesineni Nani: ఏపీలో వాలంటీర్లపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పని చేసే ఏ వ్యవస్థ అయినా మంచిదేనన్న ఎంపీ కేశినేని... టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలను ఇప్పుడు వాలంటీర్లు అంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యవస్థలో మంచి చెడూ రెండూ ఉంటాయని.. కొందరు చెడ్డవారు ఉన్నంత మాత్రానా.. వ్యవస్థను అంతా ఒకే గాటిన కట్టకూడదన్నారు. ప్రజలకు మంచి చేసే ఏ వ్యవస్థనైనా టీడీపీ ప్రోత్సహిస్తోందన్నారు.