కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్బంగా ఈనెల 30న విశాఖపట్నంలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని సీఎంను ధర్మశ్రీ ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం నియోజకవర్గ సమస్యలపై సీఎంకు విన్నవించారు ధర్మశ్రీ. కాగా సీఎంను కలిసిన అనంతరం ఎమ్మెల్యే ధర్మశ్రీ.. కొంతమంది ప్రభుత్వ సలహాదారులు, పార్టీ పెద్దలను కలిసి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఇదిలావుంటే కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ధర్మశ్రీ. 2014 సాధారణ ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ధర్మశ్రీ.. టీడీపీ అభ్యర్థి సన్యాసిరాజుపై ఓటమిచెందారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి సన్యాసిరాజుపై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో దాదాపు 28 వేల భారీ మెజారిటీతో ధర్మశ్రీ విజయం సాధించారు. వైసీపీ అధికార ప్రతినిధిగా కూడా ధర్మశ్రీ కొనసాగుతున్నారు.