JC Diwakar Reddy: మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సంతకాలు ఫోర్జరీ

JC Diwakar Reddy: తన సంతకం ఫోర్జరీ చేశారంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Update: 2024-05-29 05:50 GMT

JC Diwakar Reddy: మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సంతకాలు ఫోర్జరీ

JC Diwakar Reddy: తన సంతకం ఫోర్జరీ చేశారంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాహితీ లక్ష్మినారాయణ అనే వ్యక్తితో పాటు ఆయన కొడుకు సాత్విక్ సహా తదితరులపై కంప్లయింట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్‌ 62లోని తన ఇల్లును సాహితీ లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నట్టు తెలిపారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.

దాంతో బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ... తన సంతకం ఫోర్జరీ జరిగిందని, ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. దీంతో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్‌ షాజుద్దీన్‌లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News