Cyclone Alert - AP: ఏపీకి మరో వానగండం.. ఉత్తరాంధ్రపై పెను ప్రభావం...
Cyclone Alert - AP: ఏపీకి మరో వానగండం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది
Cyclone Alert - AP: ఏపీకి మరో వానగండం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఏపీ, ఒడిశా తీరం వైపుగా దూసుకొస్తున్నట్లు తెలియజేసింది. నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఇది వాయుగుండంగా మారి, ఎల్లుండి తుపానుగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలియజేశారు.
తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక వాయుగుండం తుపానుగా బలపడితే దానికి 'జవాద్' అని పేరుపెట్టనున్నారు.