APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల దుమారం
APSRTC: ఆర్టీసీ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తుందనే ఊహాగానాలు
APSRTC: APS RTCలో అద్దె బస్సులకు టెండర్లు పిలవడం తీవ్ర దుమారం రేగుతోంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కొత్త బస్సులను ప్రవేశపెట్టకుండా అద్దె బస్సులకు టెండర్లు పిలవడం తీవ్ర వివాదస్పదం అవుతుంది. ఆర్టీసీలో కొత్త నియామకాలకు బ్రేకులు వేసే ఉద్దేశంలో భాగంగా అద్దె బస్సులు ప్రవేశపెడుతున్నారని కార్మికులు అంటుంటే ప్రస్తుతం నష్టాలను భర్తీ చేసుకోవడం కోసమేనని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది.
APS RTCలో అద్దె ప్రాతిపదికన 998 బస్సుల ఏర్పాటుకు టెండర్లు పిలవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లీజు ప్రాతిపదికన భర్తీ చేస్తే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2వేల పోస్టులకు ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం ఉండదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటె అద్దె బస్సుల విషయంలో వస్తున్న ప్రచారాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కొట్టిపారేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రస్తుతం 995 అద్దె బస్సులు నడుపుతున్నామని, కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్తవి కొనలేక అద్దెవి నడుపుతున్నామని తెలిపారు. అద్దె బస్సులు కూడా పాతవి కాకుండా కొత్తవి, కండిషన్ లో ఉన్నవి మాత్రమే టెండర్లలో పాల్గొనాలని తెలిపారు. అలాగే అద్దె బస్సులు వల్ల ఏ ఒక్క ఉద్యోగి భద్రతలకు భంగం వాటిల్లదని ద్వారకా తిరుమలరావు అన్నారు.