Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు

Srisailam Dam: శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది.

Update: 2024-07-27 05:17 GMT

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు

Srisailam Dam: శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 15 రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం వరదనీటితో కళకళలాడుతుంది. గంటగంటకు వరదనీరు భారీగా పెరగటంతో ప్రాజెక్టులోని నీటి మట్టం గంటగంటకు పెరుగుతుంది.

ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైల జలాశయానికి 3 లక్ష 43 వేల 888 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 863.40 అడుగులకు చేరింది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 116. 82 టీఎంసీలకు చేరుకుంది.. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రానికి వరద ఉదృతి పెరిగే అవకాశాలున్నాయని శ్రీశైలం డ్యామ్ అధికారులు అంచనాలు వేస్తున్నారు.

Tags:    

Similar News