Free Ration: సామాన్యులకు బంపర్ ఆఫర్..రేషన్, ఆధార్ లేకున్నా ఫ్రీగానే నూనె, కందిపప్పు, బియ్యం
Free Ration: ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆ రాష్ట్రంలోని సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్రీగానే నిత్యవసర సరుకులపై ఆంక్షలు లేకుండా చేసింది. దీంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Free Ration: సామాన్యులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ప్రభుత్వం అందించే సహాయంపై ఆంక్షలు తొలగించింది. రేషన్ కార్డులతో ఎలాంటి ముడిపెట్టకుండా రేషన్ సరుకు ఇస్తామని వెల్లడించింది. ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పాస్ మిషన్ ద్వారా సరుకులు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగానే భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇంకా లక్షలాది మంది ప్రజలు జలదిగ్భందంలోనే ఉన్నారు. ఇలాంటి వారికి నిత్యవసర సరుకులను ఫ్రీగానే అందిస్తామని ప్రకటించింది.
శుక్రవారం ఉదయం నుంచి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ ఉచిత నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. ఇంకో విషయం ఏంటంటే ఈ నిత్యవసర సరుకుల పంపిణీకి రేషన్ కార్డులు లేని వారికి కూడా ఇస్తామని తెలిపారు.
అయితే ఈ పాస్ మిషన్ ద్వారా ముంపు ప్రాంతాల్లోని 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే వరద బాధితులకు అంటే సుమారు 2లక్షల మందికిపైగా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే రేషన్ కార్డులు లేని వారు ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ నిత్యవసర సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు.
విజయవాడలోని వరద బాధిత కుటుంబాలకు నిత్యవసరాల కిట్ తోపాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ఈ కిట్లో 25కిలోల బియ్యం లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, కిలో కందిపప్పు, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో చెక్కర ఉంది. మొదటి విడతగా 50 వేల కుటుంబాలకు ఈ సాయం అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. ఈ సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది ప్రభుత్వం.