CM Jagan: ఏపీ సీఎం జగన్ పాలనకు నాలుగేళ్లు ...
CM Jagan: 2019 మే 30న జగన్ ప్రమాణ స్వీకారం
CM Jagan: AP CM జగన్ పాలనకు నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత సరిగ్గా ఇదే రోజు CMగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. పింఛన్ల పెంపుపై మొదటి సంతకం చేసిన జగన్. ఈ నాలుగేళ్లు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి విషయంలోనూ తనదైన మార్పు చూపిస్తున్నారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు.
జగన్ పాలనలో ఏపీలోని 38 వేల స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. సకల సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారయ్యాయి. గ్రామాల్లో రైతులకు భరోసానిచ్చేందుకు ఏకంగా 10 వేల 778 RBKలు ఏర్పాటయ్యాయి. అవినీతికి తావులేని పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊరిలోనే అందించడానికి 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కొత్తగా లక్షా 34 వేల మంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగులుగా చేరారు.
ఇక ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2 లక్షల 65 వేల మందితో వలంటీర్ల సైన్యం వచ్చింది. వైద్యుల్లేరనే మాటకు తావులేకుండా 10 వేల 592 గ్రామ, పట్టణ హెల్త్ క్లినిక్‌లు సేవలందిస్తున్నాయి. అటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ స్కూళ్లను తయారు చేశారు. ఇంగ్లీషు విద్యతో విద్యార్థులు మరింత ముందుకు వెళుతున్నారు. ఎడ్యుటెక్ కంటెంట్‌తో అందే ట్యాబ్‌లు ఏపీ పిల్లల్ని ర్యాంకర్లను చేస్తున్నాయి.
పేదలకు రేషన్ సరుకులూ ఇంటి ముంగిటకే వస్తున్నాయి. దీనికోసం 9 వేల 260 డెలివరీ వ్యాన్‌లు పనిచేస్తున్నాయి. సొంతింటికి నోచుకోని 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వారికి ఇళ్ల పట్టాలివ్వటమే కాదు. ఇళ్ల నిర్మాణాన్ని భుజానికెత్తుకున్నారు. చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. ఇక నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి అమలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత భరోసా YSR సున్నావడ్డీ పథకానికి జీవం పోశారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ప్రణాళికా బద్దంగా సంక్షేమ పథకాలు కొనసాగించారు. పోలీస్ వ్యవస్థను పటిష్ట పరచడంతో నేరాలు గణనీయంగా తగ్గాయి. మహిళల భద్రత కోసం దిశ వ్యవస్థను రూపొందించారు. దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నాలుగేళ్లల్లో లబ్దిదారుల ఖాతాల్లో 2 లక్షల 11 వేల కోట్ల రూపాయలను జమ చేశారు. SC, ST, BC, మైనార్టీ వర్గాల ప్రజల ఖాతాల్లో లక్షా 56 వేల 987 కోట్ల రూపాయలను నేరుగా జమ చేశారు. అమ్మఒడి, విద్యా దీవెన తదితర పథకాల ద్వారా విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు ఏపీ సీఎం జగన్.