Nandyala: కుక్క కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత

Nandyala: నంద్యాల జిల్లాలో చిరుత పులి బోనులో చిక్కింది.

Update: 2024-06-28 07:09 GMT

Nandyala: కుక్క కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత

Nandyala: నంద్యాల జిల్లాలో చిరుత పులి బోనులో చిక్కింది. కొన్ని రోజులుగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. సిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరలోని టోల్ గోట్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో కుక్కను ఎరగా వేయడంతో చిరుత వచ్చింది.

చిరుతకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత అటవీ ప్రాంతానికి తరలించనున్నారు. మనుషులపై దాడిచేసిన చిరుత ఇదేనా కాద అని నిర్దారించనున్నారు. ఇటీవల చిరుత దాడిలో ఓ మహిళ చనిపోయింది. మరో ఇద్దరిపై చిరుత దాడి చేసింది. ఎట్టకేలకు చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మరో చిరుత కూడా సంచరిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ చిరుతను కూడా బంధించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Tags:    

Similar News