Pawan Kalyan: ఎన్నికల్లో స్వేచ్ఛగా నామినేషన్ వేసే పరిస్థితి లేదు

Pawan Kalyan: బ్రిటీష్ పాలననుంచి విముక్తి లభించినా ఎవరికి ఊడిగం చేయాలని ప్రశ్నించారు.

Update: 2022-11-09 01:47 GMT

ఎన్నికల్లో స్వేచ్ఛగా నామినేషన్ వేసే పరిస్థితి లేదు

Pawan Kalyan: ఏపీలో ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు. బ్రిటీష్ పాలననుంచి విముక్తి లభించినా ఎవరికి ఊడిగం చేయాలని ప్రశ్నించారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాని అవగలిగే పరిస్థితులు అనుకూలించినపుడు, ఏపీలో ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇతరులను ఎందుకు రానివ్వరని ప్రశ్నించారు. స్వాతంత్ర్య భారతదేశంలో పంచాయతి ఎన్నికల్లో స్వేచ్ఛగా నామినేషన్ వేసే పరిస్థితి లేకపోవడం దేనికి నిదర్శమని ప్రశ్నించారు. ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలుకొట్టక తప్పదని ప్రతిన బూనారు. అలాంటి రోజుకోసం ఎదురుచూస్తున్నట్లు భావోద్వేగ సన్నివేశాలతో వీడియోతో తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Tags:    

Similar News