Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు
Rain Alert: ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain Alert: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రెండు కలిసి తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి ఆల్పపీడనంగా ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంగా రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా ఉత్తరకోస్తా ఏపీ మరియు యానంలో, దక్షిణ కోస్తాలో నేడు భారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 40-40 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని తెలిపింది.
దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, క్రుష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని వాతవరణశాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ పడుతాయని తెలిపింది.
ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో భారీ నుంచి అతి భారీ కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది.