Pawan Kalyan: శ్రీవారి లడ్డూ అపవిత్రం.. నేటి నుంచి 11రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షకు పవన్ సిద్దం

Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్.

Update: 2024-09-22 00:02 GMT

Pawan Kalyan: శ్రీవారి లడ్డూ అపవిత్రం..11రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షకు పవన్ సిద్దం

 Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి పట్ల జరిగిన ఈ అపచారం సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరికీ శోచనీయమని, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రాయశ్చిత దీక్ష చేయాలని ఆయన సంకల్పించారు.

ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరునిలోని శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు. నేటి నుంచి 11 రోజులపాటు దీక్ష కొనసాగించనున్నారు. తర్వాత తిరుమలలోని శ్రీవారి దర్శనం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సెప్టెంబర్ 22న గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించిన తర్వాత తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటాను. దేవ దేవా నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను, తప్పిదాలను ప్రక్షాళన చేసుకునే శక్తిని ఇవ్వమని శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకుంటాను. భగవంతుడిని విశ్వాసం పాప భీతి లేనివారే ఇలాంటి ఆక్రత్యాలకు ఒడిగడతారు. నా బాధ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు కూడా అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం వారి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తుంది.

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినిగయోగించారన్న విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం వచ్చింది. ధర్మో రక్షతి రక్షత: అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News