AP Curfew: ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

AP Curfew: ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలో అమలువుతున్న పగటి పూట పాక్షిక కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

Update: 2021-05-17 08:07 GMT

AP Curfew: ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

AP Curfew: ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలో అమలువుతున్న పగటి పూట పాక్షిక కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కర్ఫ్యూ విధించి కేవలం 10 రోజులే అయ్యిందని, కర్ఫ్యూ కనీసం 4 వారాలపాటు ఉంటేనే సరైనా ఫలితాలు వస్తాయని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News