Andhra Pradesh: జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను పొడగిస్తూ రాష‌్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2021-05-31 09:40 GMT
ఏపీ లో కర్ఫ్యూ పొడగింపు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను పొడగిస్తూ రాష‌్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతకొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నా... లాక్‌డౌన్‌ను పొడగించడమే మేలని భావిచింనట్టు తెలుస్తోంది. సెకండ్ వేవ్ వ్యాప్తిని మరింత కంట్రోల్ చేసేందుకు జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో ఎటువంటి మార్పులేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విధించిన కర్ఫ్యూ నేటితో ముగియనుండగా.. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ పొడగించడంతోనే కరోనా కేసులు తగ్గించగలమని సమీక్షలో ఏకాభిప్రాయం వచ్చిందని, ఈమేరకు కర్ఫ్యూను పొడిగించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News