Coronavirus updates in AP: ఏపీలో కరోనా పంజా.. రికార్డ్ స్థాయిలో కేసులు
Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. గత మూడురోజులుగా కరోనా కేసులు సంఖ్య కాస్త తగ్గినా.. బుధవారం మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి
Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. గత మూడురోజులుగా కరోనా కేసులు సంఖ్య కాస్త తగ్గినా.. బుధవారం మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 60,576 శాంపిల్స్ పరీక్షించగా.. 10,128 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. గత 24 గంటల్లో 8,729మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 80,426 కేసులు యాక్టివ్ గా ఉంటె, 1,04,354 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 77 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 1,681కి చేరింది.
ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1544, అనంతపూర్ జిల్లాలో 1260, చిత్తూరులో 677, గుంటూరులో 730, కడపలో 729, కృష్ణాలో 440, కర్నూలులో 1368, నెల్లూరులో 537, ప్రకాశం జిల్లాలో 349, శ్రీకాకుళంలో 405, విశాఖపట్నంలో 842, విజయనగరం జిల్లాలో 665, పశ్చిమ గోదావరి జిల్లాలో 582 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ.. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 26,229 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 22,063కు చేరాయి.. అనంతపురం జిల్లాలో 20,061 కేసులు ఉన్నాయి.