Lockdown in Vijayawada: నేటి నుంచి లాక్ డౌన్.. విజయవాడలో గొల్లపూడి మార్కెట్ కు విస్తరింపు
Lockdown in Vijayawada: కరో్నా వైరస్ వ్యాప్తి, అక్కడా ఇక్కడా అని కాదు... ఎక్కడ పడితే అక్కడ చొరబడుతోంది..
Lockdown in Vijayawada: కరో్నా వైరస్ వ్యాప్తి, అక్కడా ఇక్కడా అని కాదు... ఎక్కడ పడితే అక్కడ చొరబడుతోంది... వైరస్ వ్యాపిస్తోంది. అతి జాగ్రత్తగా ఉండే ప్రాంతాల్లోనూ ఇది విస్తరిస్తుందంటే ఇక జనాలు తిరిగే చోట పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిని అదుపు చేసేందుకు చాలా చోట్ల స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వమే లాక్ డౌన్ విదిస్తోంది. దీనిలో భాగంగా విజయవాడలో సైతం కొన్ని ప్రాంతాల్లో వివిధ మార్కెట్లలో లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా వైరస్ టెర్రర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, వైద్యులు, పలువురు ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడటం ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తుంది ఏపీ ప్రభుత్వం. కొన్ని ప్రాంతాల్లో అయితే కరోనా కారణంగా వ్యాపారులే స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. అందులోనూ విజయవాడలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బెజవాడలోనూ రేపటి నుంచి లాక్‌డౌన్ కొనసాగనుంది. విజయవాడ గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్‌ను ఆరు రోజుల పాటు బంద్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. కానీ మార్కెట్లో ఎక్కువగా కరోనా కేసులు ఉండటంతో.. ఈ నెల 18వ తేదీ వరకు ఇవి నిలిచిపోనున్నాయి. కాగా ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్రభావం.. ఇతర మార్కెట్లపై సైతం పడనుంది.
ఇక ఏపీలో ఆదివారం కొత్తగా 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో 13,428 మంది చికిత్స పొందుతుండగా.. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్నఒక్క రోజే 19 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది.