CM Jagan: జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం
CM Jagan: పోలవం ప్రాజెక్టు, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులపై అధికారులతో చర్చ
CM Jagan: జలవనరులశాఖపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, ఈసీఆర్ఎఫ్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై, అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందని అధికారులు తెలిపారు.
ఈసీఆర్‌ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందు కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు చేయాలని.. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని పేర్కొన్నారు. కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం పరీక్షలు నవంబర్ మధ్యంతరం నుంచి మొదలవుతాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వీటి తుది నిర్ణయం రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ పరీక్షలు నడుస్తున్న సమయంలోనే మరోవైపు దిగువ కాఫర్‌డ్యాం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తికాగానే ఆ ప్రాంతంలో డీ వాటరింగ్ పూర్తిచేసి, డిజైన్ల మేరకు ఈసీఆర్‌ఎఫ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈలోగా ఆర్‌అండ్‌ఆర్ పనుల్లో ప్రాధాన్యతగా క్రమంలో నిర్దేశించుకున్న విధంగా 41.15 మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అధికారునలు సీఎం జగన్ ఆదేశించారు.