CM Jagan: జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
CM Jagan: ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం
Cm Jagan: ఏపీ సీఎం జగన్ జిల్లా కలెక్టర్‌లు ,ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల తీరుపై సీఎం ఆరా తీశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ ఉండాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూడాలన్నారు.
జులై 1 నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించాలని తెలిపారు. సెప్టెంబరు మొదటి వారానికి బుకింగ్స్ పూర్తిచేసి, సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలన్నారు.