CM Jagan: పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: సచివాలయ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయం..

Update: 2022-09-13 04:32 GMT

CM Jagan: పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: పాఠశాల విద్యాశాఖ, విద్యాకానుక పథకం, నాడునేడు పనుల పురోగతిపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్షి నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు పలుసూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా నాడు–నేడు కింద పనుల పురోగతిపై అధికారుల నివేధికను పరిశీలించిన జగన్... అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలని నిర్దేశించారు. అలాగే టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, స్కూళ్లో ఇంటర్నెట్‌ సదుపాయం, విద్యాకానుక వంటి కీలకాంశాలపై ఈసందర్భంగా చర్చించారు. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కచ్చితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్నారు. ఇక అన్ని స్కూళ్లలో నిరంతరంగా ఇంటర్నెంట్ ఉండేటా చూడాలన్నారు.

Full View


Tags:    

Similar News