Andhra Pradesh: కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
Andhra Pradesh: ఏపీలోని కరోనా పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Andhra Pradesh: ఏపీలోని కరోనా పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై పూర్తి అప్రమత్తతో ఉండాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలోని ఆస్పత్రుల సంసిద్ధతపై ఫోకస్ చేశామన్న మంత్రి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామన్నారు. కరోనా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు కర్నూలులో అతిసార వ్యాధిపై దృష్టిసారించిన సీఎం మంత్రి ఆళ్ల నానిని వెంటనే కర్నూలుకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. కర్నూలు జిల్లాలో పరిస్థితిపై నివేదిక కోరడంతో హుటాహుటిన మంత్రి ఆళ్ల నాని కర్నూలుకు బయలుదేరారు. ఆదోని ప్రాంతంలో జరిగిన జాతర, నంద్యాలలో మంచినీటిలో ఇబ్బందులు ఉన్నట్లు ఇప్పటికే ప్రాధమిక సమాచారం ఉండడంతో రేపు కర్నూలులో పర్యటించి సీఎం జగన్‌కు నివేదిక ఇవ్వనున్నారు.