Chandrababu: తెలుగు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
Chandrababu: ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారు
Chandrababu: తెలుగు ప్రజలకు TDP అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. జైలు ఉండటంతో పూర్తి మేనిఫెస్టో విడుదల చేయలేకపోతున్నానని చంద్రబాబు తెలిపారు. జైలు నుంచి వచ్చాక పూర్తి మేనిఫెస్టోను విడుదల చేస్తానని అన్నారు. తాను జైలులో లేను ప్రజల హృదయాల్లో ఉన్నానని చంద్రబాబు లేఖలో తెలిపారు. ప్రజల నుంచి తనను ఎవరు దూరం చేయలేరన్నారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరపలేరని.. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తోందన్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.