ఏపీలో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధింపు

Update: 2020-09-18 10:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాట్ కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నట్లు తెలిపింది. రహదారి అభివృద్ధి నిధి కోసం దీన్ని వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సెస్‌ ద్వారా రూ.600కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తాన్ని డీలర్‌ నుంచి వసూలు చేయాలని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్డినెన్స్‌ జారీ అనంతరం సెస్‌ పెంపుపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.



Tags:    

Similar News