Andhra Pradesh: ఆక్సిజన్, బెడ్లు లేవంటూ దుష్ప్రచారం చేయడం తగదు: బొత్స
Andhra Pradesh: ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
Andhra Pradesh: ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామన్నారు మంత్రి బొత్ససత్యనారాయణ. 104కు కాల్ చేసిన రెండు, మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని మంత్రి ఆదేశించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆక్సిజన్, బెడ్లు లేవంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదని మంత్రి బొత్ససత్యనారాయణ హెచ్చరించారు.