Atchannaidu Petition Over Treatment Postponed in HC: అచ్చెన్నాయుడు పిటిషన్‌పై తీర్పు వాయిదా

Update: 2020-07-06 12:39 GMT

Atchannaidu Petition Over Treatment Postponed in HC: ఈఎస్ఐ అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అచ్చెన్నాయుడు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ప్రకటనను ఎల్లుండికి వాయిదా వేసింది.

ఈఎస్ఐ స్కాంలో ఈ ఏడాది మే 7వ తేదీన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. నిమ్మాడలో అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తరలించారు. జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత ఈ నెల 1వ తేదీన ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. టీడీపీ హ‌యాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 


Tags:    

Similar News