కాసేపట్లో ఏపీటీఎఫ్ సమావేశం

Andhra Pradesh: వేతన సవరణ విషయంలో ఉపాధ్యాయ సంఘా అసంతృప్తి, ప్రభుత్వ చర్చల్లో నిర్ణయాలతో విభేదించిన ఉపాధ్యాయ సంఘాలు.

Update: 2022-02-06 04:06 GMT

కాసేపట్లో ఏపీటీఎఫ్ సమావేశం

Andhra Pradesh: ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు జరిగిన చర్చలు ఫలించాయి. ఇవాళ అర్థరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను ఉద్యోగ సంఘాలు విరమిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో హెచ్ ఆర్ ఏ అంశంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యా సంఘాల ప్రతినిధులతో చర్చించకుండానే సమ్మె విరమణ ప్రకటన చేశారని ఆరోపిస్తున్నారు.

 చలో విజయవాడ విజయవంతం చేసిన తమకు అన్యాయం జరిగిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ వ్యవహారంపై కాసేపట్లో ఉపాధ్యాయ సంఘాలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు ఉపాధ్యాయ సంఘాలు.

Tags:    

Similar News