APSRTC: కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఆర్టీసీ చర్యలు
APSRTC: ఏజెన్సీ ప్రాంతంలో బస్సులను ఏర్పాటు చేస్తాం: పేర్నినాని
APSRTC: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాతుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే అనేక మంది మరణించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అస్పత్రులు కొవిడ్ రోగులతో నిండిపోయాయి. దీంతో కరోనా రోగులతో ఆస్పత్రుల్లో బెడ్లు ఫుల్ అవుతున్నాయి. మరోవైపు అక్సీజన్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకున్నారు. వెన్నెల స్లీపర్ ఎసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులకు బస్సుల్లోనే వైద్య సేవలు అందించనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పేర్నినాని. ఏజెన్సీ ప్రాంతాలపైన బుట్టాయిగూడెం, కె.ఆర్.పురం పీహెచ్ సీల్లో ఆక్సిజన్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రస్తుతం 1 లక్ష92 వేల 104 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 18 వేల 285 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 99 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షల 27 వేల 390కు చేరారు.