Corona Treatment: కీలక జీవో జారీ చేసిన జగన్ సర్కార్
Corona Treatment: జగన్ సర్కార్ మారో కీలక జీవో జారీ చేసింది.
Corona Treatment: జగన్ సర్కార్ మారో కీలక జీవో జారీ చేసింది. కోవిడ్ పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50శాతం పడకలను కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణమే 50 శాతం బెడ్లను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఆస్పత్రుల్లో ఇంకా బెడ్లు మిగిలిఉంటే కోవిడ్ పేషంట్లకు ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు, ఎంప్యానెల్ జాబితాలోని ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. ఎంప్యానెల్ కానీ ఆస్పత్రులను తాత్కాలిక ఎంప్యానెల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిలోనూ 50శాతం బెడ్లు కోవిడ్ ఉచిత, నగదు రహిత వైద్యం పొందే పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఆరోగ్యమిత్ర, నోడల్ ఆఫీసర్ల పరిధిలోకి బెడ్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏ కోవిడ్ పేషంట్‌ను ఆస్పత్రిలో అడ్మిషన్ నిరాకరించరాదని ప్రభుత్వం పేర్కొంది. కచ్చితంగా డాక్టరు అడ్మిషన్ సూచించిన వారిని చేర్చుకోవాలని ఆదేశించారు