రాజకీయాల్లో నిబద్దత ఉండాలని, సినిమా షూటింగ్‌లాగా వ్యవహరిస్తే జనం నవ్వుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఛలోక్తులు విసిరారు. లాంగ్‌మార్చ్ పేరుతో కారుమార్చ్ చేసి రెండో రోజు వెళ్ళి రిసార్ట్‌లో కూర్చువడం రాజకీయం కాదన్నారు. సినిమా స్టైల్లో స్టేట్‌మెంట్లు ఇస్తే జనం ఆదరించరన్నారు. వైయస్ జగన్ చేసినట్టు 14 నెలలు మూడువేల కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసి చూపించాలని సవాల్ విసిరారు. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. రాజకీయాలు చేయాలంటే రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు.