Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దుచేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దుచేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక మార్పులకు ఆదేశించారు. అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేశారు. ఇకపై అన్ని కాలేజీలకు జేఎన్టీయూ నుంచే ప్రశ్నాపత్రాలు అందించాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాల నిరోధానికే ఈ మార్పులు చేపడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.
డిగ్రీ పట్టా అందుకుంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలన్నారు సీఎం జగన్. అయితే, నైపుణ్యం లేకుండా కనీసం ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోలేరని అన్నారు. అందుకే, ప్రతి కోర్సులో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని నిర్ణయించామన్నారు. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు ఏం విలువ ఉంటుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్. కొత్తకొత్త కోర్సులు, సబ్జెక్టులతో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఇక, విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.