Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ సోము వీర్రాజు
Somu Veerraju: రాజకీయాలు తప్పా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శ
Somu Veerraju: రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితంగా మాట్లాడుతూ మూడు రాజధానులపై డ్రామాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. అధికార పార్టీ నేతలు రమ్యమైన రాజకీయం నడుపుతున్నారని విమర్శించారు. 8 వందల కోట్లు ఖర్చు పెడితే సిక్కోలులోని పలు ప్రాజెక్టులు పూర్తి అయి జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే నేతలకు అభివృద్ధిపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.