Chandrababu: రేపే విచారణ.. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు

Chandrababu: తనకు మధ్యంతర బెయిల్ కావాలని హైకోర్టులో పిటీషన్

Update: 2023-11-07 09:31 GMT

Chandrababu: రేపే విచారణ.. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు 

Chandrababu: ఏపీ సీఐడీ తనపై మోపిన ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని కూడా తప్పు పట్టడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఉచిత ఇసుక విధానంపై కేబినెట్‌లో ముందు చర్చించలేదంటూ ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొనడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News