Andhra Pradesh: ముగిసిన ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్
Andhra Pradesh: ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల తర్వాత క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటేసే అవకాశం ఇస్తారు.
Andhra Pradesh: ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల తర్వాత క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటేసే అవకాశం ఇస్తారు. ఇక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటలకే పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7వేల220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. జెడ్పీటీసీ బరిలో 2వేల 58మంది అభ్యర్థులు ఎంపీటీసీ బరిలో 18వేల 782మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కౌంటింగ్ నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించడంతో అప్పటివరకు ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లోనే నిక్షిప్తం కానుంది.
ఏపీ పరిషత్ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు అనేకచోట్ల గొడవకు దిగారు. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.