Andhra Pradesh: ఏపీలో దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

Andhra Pradesh: ఏపీలో పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను సిద్దం చేసింది.

Update: 2020-08-22 01:52 GMT

Andhra Pradesh: ఏపీలో పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను సిద్దం చేసింది. వచ్చే నెల సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందించగా.. కరోనా వల్ల విద్య సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు. దసరాకు ఐదు (అక్టోబర్ 22 నుంచి 26 వరకు), సంక్రాంతి (జనవరి 12 నుంచి 17 వరకు) ఆరు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి.. విద్య సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,544 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,010 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,544 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లా 16, పశ్చిమ గోదావరి జిల్లా 13, నెల్లూరు జిల్లా 12, తూర్పు గోదావరి జిల్లా 11, అనంతపురం జిల్లా 08, కడప జిల్లాలో 07, విశాఖపట్నం జిల్లా 06, శ్రీకాకుళం జిల్లా 05, ప్రకాశం జిల్లా 04, గుంటూరు జిల్లా 03, కర్నూలు జిల్లా 03, కృష్ణ జిల్లా 03, కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,34,940. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,092.రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా 46,668 కర్నూల్ జిల్లా 37, 300 అనంతపురం జిల్లా 33, 307 కేసులు నమోదు.

ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,44,045 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 87,803 మంది చికిత్స పొందుతున్నారు. గత 24గంటల్లో 55,010 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 31,29,857 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.  

Tags:    

Similar News