అభయ్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాటు మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

Update: 2020-11-23 08:13 GMT

AP CM Jagan launched Abhayam Project

ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాటు మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో సోమవారం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం మహిళల కోసం అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్న జగన్ మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదని స్పష్టం చేశారు.

''రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయం యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఆటోలు, క్యాబ్‌ల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు యాప్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఆటో, క్యాబ్‌లో అభయం యాప్‌ డివైజ్ ఏర్పాటు చేస్తాం. తొలిసారిగా వెయ్యి వాహనాల్లో డివైజ్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాలకు డివైజ్ ఏర్పాటు చేస్తాం,, అనిఅని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్‌ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు.

    

Tags:    

Similar News