కోర్టు స్టేలతో వాయిదా పడుతూ వస్తోన్న ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. కోర్టు స్టేలు ఉన్నాసరే డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కోర్టు స్టేలు లేని ప్రాంతాల్లో డి-ఫామ్ పట్టాతో ఇళ్ల స్థలాలను కేటాయించనున్నారు. డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతోపాటు అదేరోజు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటివరకు 30లక్షల 68వేల 281 లబ్దిదారులను గుర్తించిన ప్రభుత్వం తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.