AB Venkateswara Rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం

AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్‌ అధికారి AB వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Update: 2024-05-31 07:11 GMT

AB Venkateswara Rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం

AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్‌ అధికారి AB వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రింటింగ్&స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు AB వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసింది. ఉద్యోగ పదవీకాలం రీత్యా ఈరోజు సాయంత్రం పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో తిరిగా పోస్టింగ్ ఇచ్చింది.

అయితే నిన్న సచివాలయంలో వెంకటేశ్వరరావు సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రతిని సీఎస్‌కు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్‌ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని సీఈవో కార్యాలయంలో కూడా ఏబీవీ అందజేశారు. అంతకుముందు ఏబీ వెంకటేశ్వరరావుకి గురువారం హైకోర్టులో ఊరట లభించింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది. తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. 

Tags:    

Similar News